![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -916 లో... వసుధార రిషి ఇద్దరు పెళ్లి చేసుకున్నారని ఏంజిల్ తట్టుకోలేకపోతుంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అన్న బాధ కంటే, తనకి చెప్పకుండా చేసుకున్నారు అన్న బాధే ఏంజిల్ లో ఎక్కువగా ఉంది. అందుకే రిషి జరిగింది మొత్తం చెప్పినా ఏంజెల్ నమ్మకుండా అదంతా ఒక నాటకమని మాట్లాడేసరికి రిషి మరింత వివరంగా చెప్తాడు.
ఏంజిల్ ఎంత చెప్పిన వినకపోయేసరికి వసుధార కలుగజేసుకొని మా పరిచయం ఇప్పటిది కాదు. నేను రిషి సర్ స్టూడెంట్ ని మా మధ్య ప్రేమ మొదలై పెళ్లి వరకు వచ్చిందని ఏంజిల్ కి వసుధార చెప్తుంది. ఎన్నిసార్లు మీ మీద నాకు డౌట్ వచ్చి అడిగిన.. మీరు చెప్పలేదు. నేను మిమ్మల్ని చాలా నమ్మాను. నన్ను మోసం చేశారని ఏంజిల్ బాధపడుతుంది. అప్పుడు రిషి సర్ చెప్పే పరిస్థితిలో లేడు. తనని కాదని నేను చెప్పలేదని వసుధార అంటుంది. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గర రిషి వసుధార ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. మరొకవైపు విశ్వనాథ్ ఇంట్లో ఉన్న అనుపమకి బయట ఏదో మాటలు వినిపిస్తున్నాయని బయటకు వస్తుండగా.. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఫోన్ చెయ్యడంతో ఆగిపోతుంది. మరొకవైపు వసుధారకి ఏంజిల్ చేతుల మీదుగా చీర తాంబూలం విశ్వనాథ్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత మీరు నన్ను ఒక తెలివి తక్కువ దదమ్మ లాగా చేశారని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత రిషి వసుధార ఇద్దరు బయల్దేరి వెళ్తారు. ఆ తర్వాత పై నుండి కిందకి వస్తున్న అనుపమని చూసి విశ్వనాథ్ ఆశ్చర్యపోతాడు.. అనుపమ ఇన్ని రోజులకి ఈ నాన్న గుర్తుకు వచ్చాడా ఇన్ని రోజులకి నాపై కోపం తగ్గిందా అని అనగానే ఏంజిల్ షాక్ అవుతుంది. ఆ తర్వాత అనుపమని ఏంజిల్ కి విశ్వనాథ్ పరిచయం చేస్తాడు. అనుపమ నా కూతురు నీకు అత్తయ్య అని ఏంజెల్ ని పరిచయం చేస్తాడు.
మరొకవైపు జగతి ఫోటో దగ్గరికి వచ్చి.. మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. ఇక నేను తాగాను అంటూ తమ జ్ఞాపకాల డైరీని చూస్తూ ఉంటాడు. అనుపమని గురించి అడుగుతుంది. నేనేం మాట్లాడలేకపోయానంటు మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మరొక వైపు అనుపమ బట్టలు సర్దతు ఉంటే.. ఒక ఫోటో కిందపడి పోతుంది. చూపించు అత్తయ్య అని ఏంజిల్ అడుగుతుంది. అది నా పర్సనల్ అని ఆ ఫోటో ని ఏంజిల్ కి చూపించదు. మరొక వైపు ఏంజిల్ మన మాట వినట్లేదు కానీ విశ్వనాథ్ గారు మన సిచువేషన్ అర్థం చేసుకున్నారని రిషి, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |